అనుకోని సమయాల్లో విపత్తు ప్రమాదంలో ఎలా కాపాడుకోవాలి..

అనుకోని సమయాల్లో విపత్తు ప్రమాదంలో ఎలా కాపాడుకోవాలి..

ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఫ్లాష్ ఫ్లడ్స్ పై మాక్ డ్రిల్ నిర్వహణ…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహిస్తున్న విపత్తు నిర్వహణ అవగాహన కార్యక్రమాల భాగంగా ఎన్‌డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఫ్లాష్ ఫ్లడ్స్ (వరదలు)పై మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి డి.రామునాయక్ పేర్కొన్నారు. శ‌నివారం  నంద్యాల పట్టణంలోని చెరువుకట్ట వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసే ప్రదేశం వద్ద ఫ్లాష్ ఫ్లడ్స్ పై మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. ఎఎస్పి ఎం. జావళి ఆల్ఫోన్స్, ఆర్డీఓ విశ్వనాథ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక, ఆర్టీఓ శివ కుమార్ రెడ్డి, ఎఆర్డీ ఎస్పీ శ్రీనివాసరావు, ఎన్ డి ఆర్ ఎఫ్ ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ,ఏ ఆర్ రిజర్వు ఇన్స్పెక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డిఆర్ఓ రామునాయక్ మాట్లాడుతూ గతంలో తుఫానులు, వరదల సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు, రక్షణ చర్యలపై అధికారులకు, ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. రాష్ట్రం నుండి వచ్చిన ఎన్‌డీఆర్ఎఫ్ బృందం 0సభ్యులు ప్రాక్టికల్ మాక్ డ్రిల్ ద్వారా వివిధ అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, ప్రజలను సురక్షితంగా ఎలా తరలించాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

ఎఎస్పి ఎం. జావళి ఆల్ఫోన్స్ మాట్లాడుతూ ముఖ్యంగా బోట్ క్యాప్‌సైజ్ అయినప్పుడు చేపట్టాల్సిన రెస్క్యూ ఆపరేషన్లు, బాధితులను రక్షించే విధానాలపై ప్రత్యక్షంగా ప్రదర్శనలు ఇచ్చి అవగాహన కల్పించారన్నారు. అలాగే విపత్తు సమయంలో వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఎంత కీలకమని వివరించారు. రెస్క్యూ ఆపరేషన్లలో విభాగాల మధ్య సమర్థవంతమైన కోఆర్డినేషన్ ద్వారా ప్రాణ నష్టం తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది అందరూ కలసికట్టుగా పనిచేస్తేనే అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోగలమని సూచించారు.

కార్యక్రమంలో భాగంగా విపత్తుల సమయంలో ఆందోళనకు లోనుకాకుండా తగిన జాగ్రత్తలు పాటించడం, ప్రాణనష్టం తగ్గించే టెక్నిక్స్ వినియోగం వంటి అంశాలను ఆర్డీఓ వివరించారు. అంతేకాక అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే సిపిఆర్ వంటి లైఫ్ సేవింగ్ విధానాలపై కూడా శిక్షణ అందించారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మాక్ డ్రిల్‌ను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించిన ఎన్‌డీఆర్ఎఫ్ బృందానికి, సహకరించిన విభాగాలందరికీ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Leave a Reply