చదువు, శుభ్రత మంచి అలవాట్లు..

చదువు, శుభ్రత మంచి అలవాట్లు..

ఎంపీడీవో సుధా ప్రవీణ్

కోడూరు -ఆంధ్రప్రభ : చదువుతోపాటుకు శుభ్రత కూడా చాలా అవసరమని ఎంపీడీవో సుధా ప్రవీణ్ అన్నారు. గురువారంనాడు మండల పరిధిలోని కోడూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర, స్వేచ్ఛ రథం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో శుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడ దైవత్వం ఉంటుందని, ప్రతి గురువారం ఒక కూడా మండలంలోని ఒక పాఠశాలకు స్వచ్ఛ రథం రావడం జరుగుతుందని మీ దగ్గర ఉన్నటువంటి చెత్త ఉపయోగం లేని వసూలు ఉంటే అర్దమపిస్తే మీకు కావాల్సిన బుక్స్ పెన్సిల్ పెన్సు అందజేస్తారని ఎంపీడీవో తెలిపారు.

పరిశుభ్రత గురించి తల్లిదండ్రులకు విద్యార్థులు వివరించాలని ఆయన అన్నారు. అనంతరం విద్యార్థుల తో కలిసి స్వచ్చ రధాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఎంఈఓ -2 కమ్మిలి నాంచారయ్య తోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply