Teacher | పాఠశాలకి బహుకరణ..
Teacher | ఘంటసాల, ఆంధ్రప్రభ : పాఠశాల అభివృద్ధికి దాతల సేవలు అభినందనీయమని.. ఎన్.జి.రంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఎల్.కృష్ణకుమారి కొనియాడారు. స్కూల్ డెవలప్ మెంట్ కమిటీ మెంబెర్ గుత్తికొండ.సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో వారి కుమార్తె యలమంచిలి. కోమల, కృష్ణప్రసాద్
దంపతులు పాఠశాలకి 70 వేలు విలువైన హెచ్ పి ల్యాప్ ట్యాప్ ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో సుభాష్ చంద్రబోస్ కుమారుడు సంపత్ కుమార్, స్కూల్ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు.

