ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం

యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ ; తెలుగుదేశం పార్టీ 44వ అవతరణ దినోత్సవం పురస్కరించుకొని పట్టణ కేంద్రంలో పట్టణ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించారు.

ఆలేరు నియోజకవర్గం ఇన్చార్జి రేగు బాలనర్సయ్య కార్యక్రమంలో మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవ పేరిట తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్ర సృష్టించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు.

అన్న నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం రెండు రూపాయలకు కిలో బియ్యం తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి నేటికీ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల అభివృద్ధి కోసం తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం నిరంతరము శ్రమించే గొప్ప నాయకుడని కొనియాడాడురు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మచ్చ నరసింహ గౌడ్, పట్టణ శాఖ అధ్యక్షుడు చిత్తర్ల శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం యాదవ్, తెలుగుదేశం పార్టీ నాయకులు శివరాత్రి కిష్టయ్య ,దుర్గపతి కృష్ణ ,సీసా రాజకుమార్ గౌడ్, శివరాత్రి యాదగిరి నాగరాజు, రాళ్ల బండి రాజు చారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply