చిత్తూరులో టిడిపి నూతన భవనానికి భూమిపూజ

చిత్తూరులో టిడిపి నూతన భవనానికి భూమిపూజ
మంత్రి రాం ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన
ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు సహా నేతల పాల్గొనడం
వేద మంత్రాల నడుమ శాస్త్రోక్త పూజలు
పార్టీ బలోపేతానికి కేంద్రంగా నిలవనున్న నూతన భవనం
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో
:
తెలుగుదేశం పార్టీ నూతన భవన నిర్మాణానికి శాస్త్రోక్తంగా భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి రాం ప్రసాద్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు పాల్గొని పునాది రాతిని ఉంచారు.
అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, టిడిపి చిత్తూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, జీ.డి. నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్, జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి తదితర నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
శంకుస్థాపన కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. వేద మంత్రాల నడుమ శాస్త్రోక్త పూజలు నిర్వహించి భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
పార్టీ బలోపేతానికి, కార్యకలాపాల విస్తరణకు నూతన భవనం కీలకంగా మారుతుందని నాయకులు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలకు ఇది కేంద్రంగా నిలుస్తుందని, కార్యకర్తలకు సమన్వయ వేదికగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
భవిష్యత్తులో పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, సమావేశాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ భవనం ముఖ్య కేంద్రంగా మారనుందని నాయకులు వెల్లడించారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో, పార్టీ నినాదాలతో కొనసాగింది.
