TDP | నంద్యాలలో వైసిపికి భారీ షాక్…

TDP | నంద్యాలలో వైసిపికి భారీ షాక్…

  • టిడిపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే శిల్ప రవి రెడ్డి ముఖ్య అనుచరుడు…
  • వైసిపి పార్లమెంట్ సోషల్ మీడియా ఇంచార్జి..
  • వందలాదిమంది టిడిపిలో చేరిక..

TDP | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసిపి నంద్యాల పార్లమెంట్ సోషల్ మీడియా ఇంచార్జి అండ్ మాజీ ఎమ్మెల్యే శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అనుచరుడు పీవీ ప్రదీప్ రెడ్డి ఆ పార్టీని వీడి ఇవాళ‌ తెలుగుదేశం పార్టీలో చేరారు. టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. టిడిపి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పీవీ ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై నమ్మకంతో పార్టీలో చేరుతున్ననన్నారు. నంద్యాల నియోజకవర్గంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ చేస్తున్న విశేష కృషి, అభివృద్ధి పనుల పట్ల ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

TDP

తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ తనను ఎంతగానో ప్రభావితం చేశాయన్నారు. ఫిరోజ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందన్నారు. రాబోయే కౌన్సిలర్ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ గెలుపున‌కు కృషి చేస్తానన్నారు. టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ… రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి యువత, వివిధ పార్టీల నేతలు టిడిపి వైపు చూస్తున్నారన్నారు. పివి ప్రదీప్ రెడ్డి చేరికతో నంద్యాల పరిధిలో పార్టీ మరింత బలోపేతం అయిందన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈరోజు ప్రదీప్ రెడ్డి టిడిపి పార్టీలో చేరడంతో వారిపై మరింత బాధ్యత పెరిగిందని కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. అలాగే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రదీప్ రెడ్డి పనిచేయాలన్నారు. టీడీపీలో సతీష్, వినోద్ కుమార్, మధు, నరేష్, శేఖర్, జైలాన్, షేక్షా, మధుమోహన్, మాలిక్, ఆదిశేష, రామచంద్రుడు, సుధాకర్, శశి, శ్రీను, నవీన్, రమణ, అబ్దుల్లా, మా భాష, వలిలతోపాటు 500 మంది తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందన్నారు.

Leave a Reply