TDP | నారావారిపల్లిలో సంద‌డి

TDP | నారావారిపల్లిలో సంద‌డి

TDP | తిరుపతి తుడా, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌కు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడానికి నారా వారిపల్లికి భారీగా టీడీపీ నాయకులు ప్రజలు భారీగా చేరుకున్నారు. భోగి పండుగ సందర్భంగా నారా వారిపల్లిలోని సీఎం స్వగ్రహంలో రాష్ట్రం నలువైపులా నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు ప్రజలు వినతి పత్రాలతో క్యూలైన్ ద్వారా సీఎం నివాసంలోకి వెళ్లారు. టీటీడీ ఈవో అనిల్ సింగల్, నారా రోహిత్, కూడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఇతర ప్రముఖులు సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌ను కలవడానికి వ‌చ్చారు.

Leave a Reply