చెన్నూరులో పోలీసుల ఉచిత వైద్య సేవలు

చెన్నూరులో పోలీసుల ఉచిత వైద్య సేవలు
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ ఆవరణలో అరైవ్-అలైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పోలీసులు.ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంత ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ప్రజా పాలన-ప్రగతి పాలన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. ప్రతీ ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని డీసీపీ భాస్కర్ సూచించారు.

రోడ్డు ప్రమాదాలు అనేవి వ్యక్తిగత నిర్లక్ష్యం మూలంగానే ఎక్కువ జరుగుతున్నాయని,వాటిపై అవగాహన కల్పించి నివారించడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం పట్టణంలోని గాంధీ చౌక్ ప్రాంతంలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని డీసీపీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు,పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
