Tapping | కక్షపూరితంగానే కేసీఆర్‌కు సిట్ నోటీసులు…

Tapping | కక్షపూరితంగానే కేసీఆర్‌కు సిట్ నోటీసులు…
- నిరసన తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులు..
Tapping | కుంటాల, ఆంధ్రప్రభ : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ నిర్మల్ బైంసా 61 వ జాతీయ రహదారిపై ఆదివారం బీఆర్ఎస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధ చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్థానిక బి.ఆర్.ఎస్ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో ర్యాలీగా నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ మాట్లాడుతూ… కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం తెలంగాణ అస్తిత్వానికే అవమానమన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ నోటీసులు ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తోందని నేతలు ఆరోపించారు. తెలంగాణలో మళ్లీ రానున్నది బిఆర్ఎస్ పార్టీ స్వర్ణ యుగమే అన్నారు.

మోసపూరిత హామీలతో గదినెక్కిన కాంగ్రెస్ అడుగడుగునా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలే సరైన గుణపాఠం చెప్తారని అన్నారు. ఇకనైనా రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకులు పై కేసులపై దృష్టి పెట్టకుండా ప్రజలపై,రైతులపై దృష్టి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెంట వార్ దశరథ్ దీక్షిత్ పటేల్ మాజీ సర్పంచ్ దాసరి కిషన్ బీఆర్ ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు రజినీకాంత్ పవర్ రాజు భోజన్న సుధాం మేళ సాయిలు బీఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
