చెన్నై : తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. అందరు చూస్తుండగానే కరెంట్ షాక్ తో తుది శ్వాస విడిచారు.ఈ విషాద ఘటన కన్యాకుమారి జిల్లాలో గత రాత్రి చోటుచేసుకుంది..
కన్యాకుమారి జిల్లాలో చర్చ్ ఉత్సవాల సందర్భంగా చేస్తున్న ఎర్పాట్ల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. బుద్దంతురై ఏరియా ఉత్సవాల్లో నిచ్చెనను తీసుకెళ్తుండగా హైవోల్టేజీ వైర్లకు తగలడంతో యువకులు విద్యుత్ షాక్ కు గురయ్యారు. కరెంట్ షాక్ కొట్టడం అక్కడికక్కడే నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
వారి ప్రాణాలను కాపాడడానికి స్థానికులు కర్రలతో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చేతికి అందివచ్చిన కుమారులు మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొన్నది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.