Tamilanadu | బాణాసంచా కేంద్రంలో పేలుడు … ముగ్గురి స‌జీవ ద‌హ‌నం

చెన్నై – త‌మిళ‌నాడులోని ధ‌ర్మ‌పురిలో నేడు ఒక బాణ‌సంచా త‌యారీ కేంద్రంలో పేలుడు సంభ‌వించింది.. ఈ పేలుడు దాటికి మంట‌లు వేగంగా ఆ కేంద్రంలోకి వ్యాపించాయి.. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ముగ్గురు స‌జీవ‌ద‌హ‌నమైన‌ట్లు స‌మ‌చారం.. మ‌రో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.. ఘ‌ట‌న వార్త తెలిసిన వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది అక్క‌డ‌కు చేరుకుని మంట‌లు ఆర్పే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది. గాయ‌ప‌డిన వారిని సమీపంలోని ఆసుప‌త్రుల‌కు చికిత్స కోసం త‌ర‌లించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *