తమిళనాడు లోని తిరుత్తని దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను, చికిత్స నిమిత్తం క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.