చెన్నై – తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin) నేటి ఉదయం తీవ్ర అస్వస్థత (Serious illness) కు గురయ్యారు. మార్నింగ్ వాక్ చేస్తుండగా కల్లు తిరగడం లాంటి లక్షణాలు కనిపించడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో హాస్పిటల్‌కు తరలించారు. ఇక, అపోలో హాస్పిటల్ వైద్య బృందం సీఎం స్టాలిన్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం స్టాలిన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని హాస్పిటల్ వర్గాలు హెల్త్ బులెటిన్ (Health Bulletin) విడుదల చేశాయి.
ఇక, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ బీజీ (Dr. Anil BG) మాట్లాడుతూ.. ఈ రోజు ఉదయం మార్నింగ్ వాక్ సమయంలో సీఎం స్టాలిన్‌కు తీవ్ర అస్వస్థత కలిగింది.. కళ్లు తిరగడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. అవసరమైన అన్ని వైద్య పరీక్షలు చేస్తున్నాం.. వైద్యుల బృందం ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తోందని వెల్లడించారు.