Talent Test | మండల స్థాయి గణిత టాలెంట్ పరీక్ష..

Talent Test | మండల స్థాయి గణిత టాలెంట్ పరీక్ష..

Talent Test | దండేపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో ఈ రోజు మండల స్థాయిలోని అన్ని ఉన్నత పాఠశాలల పదవ తరగతి విద్యార్థులకు గణిత టాలెంట్ టెస్ట్(Mathematical Talent Test) నిర్వహించారు. ఇందులో మామిడిపల్లి విద్యార్థిని అర్చన ప్రథమ స్థానం, జశ్విత్ దండేపల్లి విద్యార్థి రెండో స్థానం సాధించారు.

మూడో స్థానంలో మామిడిపల్లి విద్యార్థి సాత్విక నిలిచారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ ప్రాధనోపాధ్యాయులు రాజేశ్వరరావు మాట్లాడుతూ.. ఫోరం ఆధ్వర్యంలో టాలెంట్ పరీక్ష నిర్వహించడం అభినందనీయం అన్నారు. అనంతరం విజేతల(winners)కు బహుమతులు అందజేశారు.

వీరు ఈనెల 30న(30th) జిల్లా స్థాయిలో జరిగే ప్రతిభా పరీక్షకు హాజరుకానున్నారు. కార్యక్రమంలో పోదాం మండల అధ్యక్షుడు ఏనుగుల రమేష్, కార్యదర్శులు తనుగుల రాజమౌళి, చెట్టుపల్లి రమేష్ , గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply