తలకోన సిద్దేశ్వర స్వామి హుండీ లెక్కింపు..

యర్రావారిపాలెం, ఆంద్రప్రభ : శ్రీ తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఎండోమెంట్ శాఖ ఇన్‌స్పెక్టర్ పి. ఫణిరాజ సాయణ తిరుపతి పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు.

68 రోజుల పాటు శాశ్వత హుండీల ద్వారా రూ.2,81,606/- ఆదాయం, రోజువారీ నిత్య అన్నదాం హుండీ లెక్కింపు ద్వారా రూ.56,713/- ఆదాయం లభించిందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్ర రాజు తెలిపారు. హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని బ్యాంకులో జమ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ సోమనాథ రెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply