వారణాసి : ప్రధాని మోదీ లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలో ఇటీవల 19 ఏళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే నియోజకవర్గ టూర్‌లో ఉన్న మోదీ.. శుక్రవారం ఉదయం వారణాసిలో ల్యాండ్ కాగానే అధికారులను కలిశారు. అమ్మాయిపై జరిగిన గ్యాంగ్ రేప్ గురించి సంపూర్ణ వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
పోలీసులు, కలెక్టర్ తో ప్రధాని మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటీవల వారణాసిలో 19ఏళ్ల యువతిపై 23 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. హోటళ్లు, హుక్కా సెంటర్లు తిప్పుతూ అఘాయిత్యం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 9 మంది నిందితులను అరెస్టు చేశారు.