సద్వినియోగం చేసుకోవాలి

మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ


గన్నేరువరం, (ఆంధ్రప్రభ): మండలంలోని పలు గ్రామాలలో ఐకెపి, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavvampalli Satyanarayana) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేపడుతున్నదని, రైతులు ఆరబెట్టి న ధాన్యాన్ని శుభ్రపరచుకొని రాళ్లు, మట్టి బెడ్డలు లేకుండా చూసుకోవాలని, తేమశాతం 17లోపు వచ్చేటట్టు తమ ధాన్యాన్ని ఎండబెట్టుకోవాలన్నారు.

అనుకోకుండా వర్షాలు కురుస్తున్నందున రైతులు (Farmers) తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మార్కెట్ కు తీసుకువచ్చిన ధాన్యంపై కవర్లు కప్పుకోవాలని, ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 2389 లు, బి గ్రేడ్ ధాన్యానికి రూ.2369 లు మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తున్నట్లుగా తెలిపారు. ధాన్యం అమ్మిన రెండు రోజుల్లో రైతు ఖాతాలో డబ్బు జమ అవుతుందని తెలిపారు.

సన్న వడ్లకు 500 బోనస్ (Bonus) లభిస్తుందని దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో కిరణ్మయి, మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, మాతంగి అనిల్, కాంగ్రెస్ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, అలువాల కోటి, జువ్వాడి మన్మోహన్ రావు, లింగాల మల్లారెడ్డి, కొమ్మేర రవీందర్ రెడ్డి, చింతల శ్రీధర్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply