Tadvayi | రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని

Tadvayi | తాడ్వాయి, మేడారం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కుటుంబ సమేతంగా మేడారం సమ్మక్క–సారలమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా గద్దెలపై కొలువైన శ్రీ సమ్మక్క – సారలమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా నిలువెత్తు బంగారాన్ని తల్లులకు సమర్పించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వెంట అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ఎండోమెంట్ శాఖ అధికారులు ఉన్నారు.
