Nagarjuna | కింగ్ 100లో రొమాన్స్‌..

Nagarjuna | కింగ్ 100లో రొమాన్స్‌..

  • 27 ఏళ్ల తర్వాత నాగ్ – టబు జోడీ
  • మళ్ళీ తెరపై కనిపించనున్న హిట్‌ఫెయిర్‌

కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్ తో రా కార్తీక్ అనే తమిళ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగ్ తన సొంత ప్రొడక్షన్ లో నిర్మిస్తున్నారు. ఇది పవర్ ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోసిన చాలా గ్రాండ్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. నాగార్జున గతేడాదిలో రెండు చిత్రాల్లో కనిపించి ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు తన వందో సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇందులో సీనియర్ నటి టబు నటించనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ.. తాను, టబు ఎన్నో ఏళ్లుగా స్నేహితులమని తెలిపారు. ఆమె ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తెలుసన్నారు. వందో సినిమా చేస్తున్నా అని తెలియగానే అందులో భాగం కావాలని టబు కోరుకున్నట్లు చెప్పారు. తామిద్ద‌రం ఇందులో న‌టించ‌బోతున్నామ‌ని తెలిపారు.

“ప్రేక్షకుల అభిరుచులు వేగంగా మారుతున్నాయి. మేం వాళ్ల కోసం ప్రత్యేకమైన చిత్రాన్ని అందిస్తున్నామని అందరికీ తెలియాలి. ఆడియన్స్ వాస్తవికతకు దగ్గరగా ఉండే వాటిని ఇష్టపడుతున్నారు. అందుకే ఇందులో యాక్షన్ సన్నివేశాలు వీఎఫ్ఎక్స్ ఆధారంగా కాకుండా రియ‌ల్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. కథకు తగ్గట్టు సహజంగా దీన్ని రూపొందిస్తున్నాం” అని నాగార్జున తెలిపారు. రిలీజ్ తేదీ విషయంలో కూడా తాను తొందరపడి నిర్ణయాలు తీసుకోవట్లేదని చెప్పారు.

Leave a Reply