T20 World Cup | రికార్డులు మరో లెవెల్

T20 World Cup | రికార్డులు మరో లెవెల్
T20 World Cup | రికార్డుల మోత…
టీ20 వరల్డ్ కప్ మరో లెవెల్
50 కోట్లు దాటిన వ్యూయర్‌షిప్
జై షా హర్షం
T20 World Cup | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఎడిషన్‌గా రికార్డులకెక్కింది! భారత్‌లో మాత్రమే ఈ టోర్నమెంట్‌ను వీక్షించిన వారి సంఖ్య 50 కోట్లు దాటడం ఒక్కటే కాదు… ప్రపంచవ్యాప్తంగా రికార్డు (Record) స్థాయి వ్యూయర్‌షిప్ సాధించింది. ఒకేసారి జియో హాట్‌స్టార్‌లో 6.05 కోట్ల మంది వీక్షించడం ఇంకా ఒక అద్భుతం! ఇక, ఐసీసీ అధికారిక స్ట్రీమింగ్ సర్వీస్ ఐసీసీ.టీవీ కూడా కొత్త రికార్డులు సృష్టించింది. 2024 ఎడిషన్‌తో పోలిస్తే వినియోగదారులు 28 శాతం, వీక్షణ సమయం 56 శాతం పెరిగింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వీడియో వ్యూస్ ఇప్పటికే 10 బిలియన్లు దాటాయి.

బీసీసీఐ కార్యదర్శి జై షా ఎక్స్ వేదికగా ఈ భారీ వ్యూయర్‌షిప్ గణాంకాలను వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా టీ20ని (T20) మరింత విస్తృతం చేయాలనే లక్ష్యంతో ప్రారంభించాం… భారత్‌లోనే 50కోట్ల మంది వీక్షణలు దాటడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. నాకౌట్ దశ ప్రారంభమైన ఈ క్షణంలో భారత అభిమానుల ప్రేమ, ఉత్సాహం మరింత రికార్డులను బద్దలు కొట్టనున్నాయని జై షా ఆశాభావం వ్యక్తం చేశారు.
మైదానంలోనూ ఈ టోర్నమెంట్ హోరాహోరీగా సాగుతోంది. 20 జట్లతో ప్రారంభమైన గ్రూప్ స్టేజ్ నుంచి సూపర్ 8 వరకు ఉత్కంఠ, థ్రిల్లర్లు, అనూహ్య ఫలితాలతో నిండిపోయింది. ఆస్ట్రేలియా,(Australia) పాకిస్థాన్ వంటి బలమైన జట్లకు గట్టి పోటీ ఇచ్చిన జింబాబ్వే, నేపాల్ వంటి జట్లు కూడా అద్భుత ప్రదర్శన చూపాయి. నెట్ రన్ రేట్ ఆధారంగా భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి.

ఇక సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లతో ఈ టోర్నమెంట్ వ్యూయర్‌షిప్ మరింత భారీ స్థాయికి చేరే అవకాశం ఉంది. ఈ టీ20 ప్రపంచకప్ 2026 కేవలం ఒక క్రికెట్ టోర్నమెంట్ కాదు… భారత్‌లో క్రికెట్ పట్ల ఉన్న అభిమానం, ఉత్సాహానికి ఒక గ్లోబల్ గుర్తింపుగా నిలిచింది. అయితే నాలుగు క్రికెట్ (Cricket) టీమ్స్ ఫైనల్ ట్రోఫీ కోసం తీవ్రంగా పోరాడుతుండగా అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. నాకౌట్ దశలో మ్యాచ్‌లు మరింత ఉత్కంఠభరితంగా ఉండే అవకాశం ఉంది. దీంతో వ్యూయర్‌షిప్ గణంకాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి.
