Switzerland | ఆరుగురు స‌జీవ‌ద‌హ‌నం

Switzerland | ఆరుగురు స‌జీవ‌ద‌హ‌నం

Switzerland | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బస్సులో మంటలు చెలరేగి ఆరుగురు సజీవదహనమైన విషాద ఘటన స్వీట్జర్లాండ్‌లో చోటుచేసుకుంది. రాజధాని బెర్న్ సమీపంలోని కెర్జర్స్ పట్టణంలో పోస్ట్‌బస్ సంస్థకు చెందిన ప్రాంతీయ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. సహాయక బృందాలు చేరుకునేలోపే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply