swathi l 7వ వార్డులో గెలుపే లక్ష్యంగా ప్రచార ప్రభంజనం!


swathi l 7వ వార్డులో గెలుపే లక్ష్యంగా ప్రచార ప్రభంజనం!

  • చైర్మన్ రేసులో ముందున్న దావ స్వాతి..
    మహిళా జనరల్ రిజర్వేషన్‌తో పెరిగిన అవకాశాలు
  • బెల్లంపల్లి,ఆంధ్రప్రభ: బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల వేళ చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందన్న చర్చ పట్టణంలో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి దావ స్వాతి పేరు చైర్మన్ రేసులో బలంగా వినిపిస్తోంది. మున్సిపల్ చైర్మన్ పదవి ‘మహిళా జనరల్’కు రిజర్వ్ కావడంతో, కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న ప్రధాన నేతల్లో దావ స్వాతి ఒకరు. ఈ క్రమంలో ఆమె 7వ వార్డులో నిర్వహిస్తున్న ప్రచారం ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. వార్డులోని ప్రధాన కాలనీల్లో దావ స్వాతి ఇంటింటికీ వెళ్లి ఓటర్ల ఆశీస్సులు తీసుకున్నారు. చైర్మన్ అభ్యర్థిగా ఆమెకు ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ, కార్యకర్తలు వార్డును హోరెత్తిస్తున్నారు.
  • పట్టణ అభివృద్ధిపై స్పష్టమైన విజన్ ఉండటం, ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి గారికి నమ్మకస్తురాలు కావడంతో ఆమెకు చైర్మన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె గెలుపు దాదాపు ఖాయమన్న వాతావరణం వార్డులో కనిపిస్తుండటంతో, చైర్మన్ పీఠం కూడా ఆమెనే వరిస్తుందని అనుచర వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది.

  • ప్రచారంలో భాగంగా దావ స్వాతి మాట్లాడుతూ.. తనను గెలిపించి మున్సిపల్ కౌన్సిల్‌కు పంపిస్తే, కేవలం 7వ వార్డుకే పరిమితం కాకుండా మొత్తం బెల్లంపల్లి పట్టణ రూపురేఖలు మార్చడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వినోద్ సహకారంతో భారీగా నిధులు రాబట్టి, పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజీ మరియు మెరుగైన పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని వివరించారు. వార్డులో ఆమెకు లభిస్తున్న నీరాజనాలు, అడుగడుగునా మహిళల మద్దతు చూస్తుంటే పట్టణ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలవబోతోందని స్పష్టమవుతోంది. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, దావ రమేష్ అనుచరులు, వందలాది మంది మహిళలు, కార్యకర్తలు పాల్గొని ఆమె గెలుపు కోసం జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

Leave a Reply