TG | స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకం.. కేసీఆర్ కి ఆహ్వానం !

గ‌త‌ కేసీఆర్ ప్రభుత్వం పునర్నిర్మాణం సందర్భంగా… ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం స్వర్ణ విమాన గోపురానికి ఈ నెల 23న మహా కుంభాభిషేకం జరగనుంది.

ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ… తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, యాదగిరి గుట్ట పునర్నిర్మాణవేత్త, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ను ఆలయ అర్చకులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.

అనంతరం… మార్చి 1 నుంచి 11 వరకు జరిగే యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కేసీఆర్ కోరారు.

ఈ మేరకు యాదగిరి గుట్ట దేవస్థానం ప్రధాన అర్చకుడు, ఆలయ కార్యనిర్వహణాధికారులతో కూడిన బృందం శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేసింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కేసీఆర్‌ను వేద మంత్రాలతో ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వరాచార్యులు, డీఈవో భాస్కర్‌, ప్రధాన అర్చకులు నరసింహమూర్తి, కిరణ్‌ కుమారాచార్యుల, పీఆర్‌వో రాజన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *