మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణంలో వెలిసిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి 60వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం రోజు స్వామివారు గజ వాహనంపై ఊరేగారు. బుధవారం ఉదయం స్వామి వారికి సుప్రభాతం పంచామృతాభిషేకం నిత్య పూజా కార్యక్రమాలను చేపట్టారు.
ఆలయ ధర్మకర్త శ్యాంసుందర్ జోషి ఆధ్వర్యంలో వివిధ పూజా కార్యక్రమాలు చేపట్టారు. స్వామివారు పెళ్లి కుమారుడై శ్రీనివాసుడి గా భక్తులకు దర్శనమిచ్చారు.
సాయంత్రం పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారి దేవాలయం నుండి గజవాహనంపై సన్నాయి మేళం గోవింద నామస్మరణల మధ్య పట్టణ పురవీధుల గుండా స్వామివారు శోభాయమానంగా ఊరేగారు. దారి పొడవునా భక్తులు స్వామివారి గజవాహనసేవ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీ పడమటి ఆంజనేయస్వామి దేవాలయం నుండి మెయిన్ రోడ్డు, ఆజాద్ నగర్ ,శివాజీ నగర్ మీదుగా బ్రాహ్మణవాడ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వరకు దాదాపు రెండు గంటలకు పైగా స్వామివారి గజవాహన శోభాయాత్ర శోభాయమానంగా సాగింది.
గజ వాహనం ఊరేగింపు సందర్భంగా పెద్ద ఎత్తున హాజరైన భక్తులు గోవింద నామస్మరణల మధ్య స్వామివారి వాహన సేవ కొనసాగింది.
ఈ కార్యక్రమం లో డి.వి. చారి , కరణం గోవిందరావు , వాదిరాజు , హన్మేష్ చారి , గోపాల చారి , కృష్ణ చారి , వంశీ కృష్ణ జోషి, విద్యాసాగర్, నరేంద్ర చారి , రాఘవేంద్రరావు, సురేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.