Suzlan Group | చివరి తేదీ ఎప్పుడంటే..?

Suzlan Group | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : 9వ తరగతి చదువుతున్న బాలికలకు, ఇంజినీరింగ్ విద్యార్థుల(గర్ల్స్)కు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో సుజ్లాన్ గ్రూప్ ముందుకు సాగుతోంది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల ఉన్నత చదువులకు మద్దతు ఇవ్వడానికి సుజ్లాన్ స్కాలర్షిప్ ప్రోగ్రాం 2025–26ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా స్కాలర్‌షిప్‌ను అందించి విద్యకు అడ్డంకులు రాకుండా సహాయపడుతుంది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అర్హులైన విద్యార్థులకు ఈ పథకం ప్రయోజనం చేకూరుస్తుంది.
ఎవరు అర్హులంటే..?
- 9వ తరగతి చదువుతున్న బాలిక విద్యార్థులకు అవకాశం.
- B.E./B.Tech. లేదా ఇంజినీరింగ్ డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు
- అన్ని వనరుల నుంచి కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలు మించకూడదు.
- దరఖాస్తుదారులు ఈ రాష్ట్రాలు/ప్రాంతాల్లో నివాసం కలిగి, గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో చదువుతూ ఉండాలి:
- మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, డామన్, పుదుచ్చేరి
- B.E./B.Tech. లేదా డిప్లొమా విద్యార్థులకు 10వ తరగతి, 12వ తరగతిలో కనీసం 50% మార్కులు.
- Buddy4Study ఉద్యోగుల పిల్లలు అర్హులు కారు.
ప్రోత్సాహకాలు / బహుమతులు
- 9వ తరగతి బాలిక విద్యార్థులు: సంవత్సరానికి రూ.6,000 (స్థిర మొత్తం), ఇంజినీరింగ్ డిప్లొమా విద్యార్థులు: సంవత్సరానికి రూ.60,000
- B.E./B.Tech. విద్యార్థులు: సంవత్సరానికి రూ.1,20,000
దరఖాస్తు వివరాలు
దరఖాస్తు చివరి తేదీ: 04-02-2026
దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తులు మాత్రమే
- దరఖాస్తు లింక్: www.b4s.in/sen/SZSP4
- QR కోడ్ లింక్: https://dle9eg0t05513.cloudfront.net/static/images/scho-
media/suzlon-scholarship-program-2025-261768844723.png
