దేవనకొండలో యువకుడి మృతి

దేవనకొండలో యువకుడి మృతి

(కోడుమూరు, ఆంధ్రప్రభ) : కర్నూలు (Kurnool) జిల్లా కోడుమూరులో మంగళవారం ఉదయం చోటుచేసుకున్న అనుమానాస్పద మరణం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే, దేవనకొండ మండలం పి.కోటకొండ గ్రామానికి చెందిన కమ్మరి దస్తగిరి (38) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి శరీరంపై గాయాలున్నట్లు గుర్తించిన పోలీసులు (police), ఇది హత్యనా? ఆత్మహత్యనా? అనే కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి భార్య స్థానికంగా ఆశా వర్కర్ గా పనిచేస్తున్నారని సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Leave a Reply