Jubilee Hills | కేర్‌టేకర్‌పై అనుమానంతో…

Jubilee Hills | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రాంతం జూబ్లీహిల్స్ లో మరో చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. వృద్ధ దంపతుల ఇంట్లో విలువైన వజ్రపు ఉంగరాలు మాయమవ్వడం కలకలం రేపుతోంది.

జూబ్లీహిల్స్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ వృద్ధ దంపతులు తమ ఇంట్లో ఉన్న వజ్రపు ఉంగరాలు కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. ఇంట్లో అన్ని చోట్ల వెతికినా అవి దొరకకపోవడంతో చోరీ జరిగి ఉంటుందని అనుమానించారు.

ఈ నేపథ్యంలో తమ ఇంట్లో కేర్‌టేకర్‌గా పనిచేస్తున్న వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేర్‌టేకర్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. చోరీకి గురైన వజ్రపు ఉంగరాల విలువపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply