Suspended | మునిసిపల్ కమీషనర్ పై సస్పెన్షన్ వేటు

Suspended | మునిసిపల్ కమీషనర్ పై సస్పెన్షన్ వేటు
Suspended | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమీషనర్ హనుమంతు కూర్మారావు పై రాష్ట్రప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జరీచేశారు. నగరంలో సోమవారం నుంచి అతిసారా వ్యాధి ప్రబలి దాదాపు 70మందికి పైగా ఆసుపత్రుల పాలు కావడం, ఒకరు చనిపోవడం వంటి సంఘటనలో శ్రీకాకుళం కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు వచ్చిన విమర్శల మేరకు మునిసిపల్ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం దర్యాప్తు జరిపారు.
కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినందువల్లనే అతిసారం ప్రబలిందని దర్యాప్తు అధికారులు ప్రభుత్వానికి Research నివేదికలో తెలియచేయడంతో కార్పొరేషన్ కమీషనర్ కూర్మారావును ప్రభుత్వం సస్పెండ్ చేసినట్లుగా మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులలో తెలిపినట్లుగా తెలిపారు.. కాగా మునిసిపల్ కమీషనర్ కూర్మారావు అధికార బాధ్యతలు చేపట్టి ఇంకా 20రోజులు కూడా కాకుండా అతనిపై సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం.




