suspended | కర్నాటక పోలీసు అధికారి సస్పెన్షన్..!

suspended | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కర్ణాటక రాష్ట్రంలోని డీజీపీ స్థాయి అధికారి కె.రామచంద్రరావు పలువురు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు బయటపడటం పెద్ద దుమారం రేపింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన అక్కడి ప్రభుత్వం తాజాగా చర్యలు తీసుకుంది. రామచంద్రరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రామచంద్రరావు ప్రభుత్వ ఉద్యోగిగా రూల్స్ ఉల్లంఘించారని అందులో పేర్కొంది. ఇది ప్రభుత్వానికి సైతం ఇబ్బందిగా మారినట్లు చెప్పింది. అందుకే ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
