మొగుళ్ళపల్లి నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా సురేష్..

మొగుళ్ళపల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా ఏం సురేష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇక్కడ పని చేస్తున్న ఎస్సై అశోక్ కుమార్ గణపురంకు ఎస్సైగా బదిలీ అయ్యారు.
ములుగు వీఆర్ లో పని చేసిన ఎస్సై ఏం సురేష్ ను మొగుళ్ళపల్లికి ఎస్సైగా బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొగుళ్ళపల్లి మండలంలో చట్టం, శాంతి భద్రతలను కాపాడేందుకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు.
ప్రజలు పోలీస్ శాఖపై విశ్వాసం ఉంచాలని, ఏవైనా సమస్యలు ఉన్నా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తెలియజేయాలని ఆయన కోరారు. నేరాలను అరికట్టేం దుకు కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలకు అందుబాటు లో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.
