సురేంద్రబాబుకు చైర్మన్ పగ్గాలు..

కాణిపాకం, ఆంధ్రప్రభ : కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా వి. సురేంద్రబాబు (మణి నాయుడు)ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. గతంలో కూడా పాలకమండలి చైర్మన్ గా అనుభవం ఉంది.

పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తూ పార్టీలో పెద్దలను చిన్న నాయకులను అందరిని సమన్యాయం చేసే పెద్ద మనస్తత్వం ఉన్న వ్యక్తిగా మరోసారి గుర్తించి పదవికి నియమించారు. వి. సురేంద్రబాబు మాట్లాడుతూ..

తనను కాణిపాకం ఆలయ చైర్మన్ గా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబుకి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి, పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళి మోహన్ కి, నాకు ఈ పదవి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు పెద్దపేట వేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Leave a Reply