ప్రచారంలో దూసుకెళ్తున్న సుప్రియ శ్రీనివాస్ గౌడ్

మేడ్చల్, ఆంధ్రప్రభ : ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని పదవ వార్డ్ ఎల్లంపేట లో గౌరయ్య గారి సుప్రియ శ్రీనివాస్ గౌడ్ తరపున ఈరోజు మాధవరం కాంతారావు, గౌరారం జగన్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. గడపగడపకు తిరిగి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి సుప్రియ శ్రీనివాస్ గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మార్పు కోసం ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధిలైట్లు, మంచినీటి నల్ల కలెక్షన్లు అన్ని సమస్యలు పరిష్కరిస్తానని పదవ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా సుప్రియ శ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు.

Leave a Reply