బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన జీవోపై సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు (BC Reservations) కల్పించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. హైకోర్టు స్టే కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయిన నేపథ్యంలో, జీవో ఆధారంగా ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోర్టును కోరింది.
ఈ కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) తీసుకోబోయే తీర్పు కీలకంగా మారింది. బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికల భవిష్యత్తు ఈ నిర్ణయంపైనే ఆధారపడి ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
