ఆదరించండి… అభివృద్ధిలో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తాa

  • మెండోరా గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కుంట లక్ష్మి రమేష్

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలు ఇచ్చే మద్దతుతో మెండోరా గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి కుంట లక్ష్మి రమేష్ తెలిపారు.

గురువారం ఐదో వార్డులో ఇంటింటా తిరుగుతూ ప్రజలను, మహిళలను కలసిన ఆమె, గ్రామ అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

గెలిచిన వెంటనే ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు గ్రామ ప్రజలకు మరింత చేరేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అమ్మాయిల వివాహాలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ వైద్య సాయం, ఎల్ఓసీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాల లబ్ధిదారులను తనే స్వయంగా ఎన్నోసార్లు సహాయం చేసి అందించేందుకు కృషి చేసిన సంగతి గ్రామ ప్రజలందరికీ తెలిసిందేనని గుర్తు చేశారు.

సర్పంచ్‌గా ఎన్నికైతే గ్రామ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కుంట లక్ష్మి రమేష్ వెంట అభిమాన నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply