సమ్మెటివ్ అసెస్మెంట్-1 పరీక్షలు వాయిదా
ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆయా పాఠశాలల ప్రాంగణాలు జలమయం అయ్యాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా(Mahbubnagar District)లో జరుగుతున్న ఎస్ఏ (సమ్మెటివ్ అసెస్మెంట్ )1 పరీక్షలను వాయిదా వేసినట్లుగా విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.
స్థానిక పరిస్థితులను ఎంఈఓ, ఎంపీడీవో(MEO, MPDO), తహసీల్దార్ పరిశీలించి పాఠశాలలకు సెలవు ప్రకటించాలని డీఈవో(DEO)లు పేర్కొన్నారు. వాయిదా వేసిన పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని డీఈవోలు పేర్కొన్నారు.

