Suicide | ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Suicide | ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Suicide | పార్వతీపురం, ఆంధ్ర ప్రభ : పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండలం వనిజ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన ఈ రోజు చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు అందించిన వివరాల ప్రకారం వనిజ గ్రామానికి చెందిన మీనాక మధు (35) భార్య సత్యవతి (30) ఇద్దరు పిల్లలతో పాటు ఆత్మ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
అయితే ఇద్దరు పిల్లలు అబ్బాయి మోస్య (04) మృతి చెందగా, కుమార్తె ఆయేషాను మెరుగైన చికిత్స కోసం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పిల్లలతో పాటు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా మధు_సత్యవతి దంపతులకు మరో ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారిరువురు చినమేరంగి కే జీబీవీలో చదువుతున్నట్లు తెలుస్తోంది. ఈ మృత్యోదంతానికి సంబంధించి పూర్తి విచారణ జరిపి నిర్ధారించాల్సింది పోలీసులే.

