యువకుని ఆత్మహత్య

యువకుని ఆత్మహత్య

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందరశాల గ్రామానికి చెందిన బొమ్మ హరికృష్ణ రెడ్డి (28) అనేయువకుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. బంధువుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం హరికృష్ణ హైదరాబాద్ వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడని తెలిపారు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జ్ లో బస చేసి గడ్డి మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడి ఇంటికి సమాచారం ఇవ్వడంతో బంధువులు బయలు దేరి ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులు మంచిర్యాల పట్టణంలోని ఓ ప్రయివేట్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ ఇవ్వాళ ఉదయం మృతి చెందాడు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బాడీని స్వగ్రామం సుందరశాలకు తరలించారు.

Leave a Reply