వివాహిత ఆత్మహత్య

వివాహిత ఆత్మహత్య

చిట్యాల, ఆంధ్రప్రభ : అప్పుల విషయంలో తలెత్తిన మనస్పర్థలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం పోలీసులు తెలిపిన ​ చిట్యాల మండలం పరిధిలో ఉన్న పెద్దకాపర్తి గ్రామానికి చెందిన శిరస్సు కల్పన (33), భర్త ప్రభాకర్ దంపతులు పెద్ద కాపర్తిలో నివాసం ఉంటున్నారు.

గత కొంతకాలంగా భర్త చేసిన అప్పుల విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని. ఈ క్రమంలోనే అప్పుల విషయమై ఇద్దరి మధ్య చిన్నపాటి వివాదం చేస్తుందని తెలిపారు నిన్న సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కల్పన తీవ్ర మనస్తాపానికి గురై, ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నారు.

మృతురాలికి 12 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. మృతురాలి తల్లి ఓర్సు ఎల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply