Suhas | హే భగవాన్ మెప్పించేనా…?

Suhas | హే భగవాన్ మెప్పించేనా…?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కలర్ ఫోటో, హిట్ 2, రైటర్ పద్మభూషణ్, మను చరిత్ర, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు.. తదితర చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు సుహాస్. ఓ వైపు హీరోగా నటిస్తూనే.. మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాడు. అయితే.. ఇప్పుడు హే భగవాన్ అంటూ వస్తున్నాడు. ఫిబ్రవరి 20న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. ఇంతకీ.. టీజర్ ఎలా ఉంది..? ఈ మూవీ సుహాస్ కు మరో సక్సెస్ అందించేనా..?

హే భగవాన్ సినిమాను ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్ ద్వయం నిర్మించింది. నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై హే భగవాన్ అనే ఫుల్‌లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నారు. డిఫరెంట్ రోల్స్ చేస్తున్న సుహాస్ హీరోగా నటిస్తే.. శివానీ నగరం నాయికగా నటించింది. ఈ ఇద్దరూ కలిసి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాలో నటించారు. ఆ సినిమా సక్సెస్ సాధించింది. ఇప్పుడు మరోసారి కలిసి నటించడంతో ఈ మూవీ పై మరింత బజ్ క్రియేట్ అయ్యింది.

ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ కీలక పాత్రలో నటిస్తే.. యాంకర్ స్రవంతి చొక్కారపు ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకి గోపీ అచ్చర డైరెక్టర్. ఇటీవల విడుదలైన ఈ చిత్రం గ్లింప్స్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ముఖ్యంగా నచ్చేలా.. ఉండడంతో సుహాస్ మరో విజయం సాధించడం ఖాయమనే ఫీలింగ్ కలిగించింది.

ఈ సందర్భంగా హీరో సుహాస్ మాట్లాడుతూ… ఈ సినిమాలో క్యారెక్టర్ గత సినిమాలతో పోలీస్తే.. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ పాత్రను చేశాను. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్ విత్ కంటెంట్. ఇక నుంచి నా సినిమాలు అందర్ని అలరిస్తాయి. ఈ సినిమాకు వంశీ నందిపాటి, బన్నీవాస్ యాడ్ అయిన తరువాత మా టీమ్‌కు మంచి బూస్ట్ వచ్చింది. నరేంద్ర రెడ్డి ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ఈ సినిమా నా కెరీర్‌లో బెస్ట్‌ఫిలింగా నిలుస్తుంది. నాకు ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది అన్నారు.
CLICK HERE TO READ Chiru Vs Balayya | ఒక తరహా కథతో చిరు, బాలయ్య..?
