అకస్మాత్తుగా కుప్పకూలి..

అకస్మాత్తుగా కుప్పకూలి..

మంత్రాలయం, ఆంధ్రప్రభ : మంత్రాలయం నియోజకవర్గ కేంద్రంలోని బృందావనం గార్డెన్ పార్కింగ్ ప్రాంతంలో కర్ణాటకకు చెందిన ఓ భక్తుడు ఆకస్మికంగా మృతి చెందడం విషాదాన్ని కలిగించింది. మృతుడు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా సింధునూర్‌కు చెందిన చందుగా గుర్తించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం మంత్రాలయానికి వచ్చిన ఆయన, పార్కింగ్ స్థలంలో అకస్మాత్తుగా కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు చుట్టుపక్కల ఉన్న భక్తులు తెలిపారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో భక్తుల్లో విషాద వాతావరణం నెలకొంది. వడదెబ్బ మూలంగా.. ఈ వ్యక్తి మృతి చెంది ఉండవచ్చే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతుంది.

Leave a Reply