అకస్మాత్తుగా అడవి పంది రోడ్డు దాటడంతో..

అకస్మాత్తుగా అడవి పంది రోడ్డు దాటడంతో..
నిర్మల్ జిల్లా, దస్తూరాబాద్ ఆంధ్రప్రభ : దస్తూరాబాద్ మండలం పరిధిలోని రేవోజిపేట టర్నింగ్ వద్ద శనివారం రాత్రి 11 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. TS16FD4611 నంబరు గల టాటా ఇండికా కారు నిర్మల్ నుండి రేవోజిపేట వైపు వెళ్తుండగా, రేవోజిపేట టర్నింగ్ సమీపంలో అకస్మాత్తుగా ఒక అడవి పంది రోడ్డును దాటడoతో డ్రైవర్ వాహనం మీద నియంత్రణ కోల్పోవడంతో.. కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ యెర్కారి గంగాధర్ మృతి చెందాడు.
బుట్టాపూర్ గ్రామానికి చెందిన కుక్కరికార్ల పవన్ కి ఛాతి, కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయని.. ఎస్ ఐ సాయికుమార్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు ఎస్ తెలిపారు. ఈ ఘటన పై ఫిర్యాదుదారు కుక్కరికర్ల గంగాధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

