success | గెలుపొందిన కొండ ప్రేమలత రవీందర్
success | మంథని, ఆంధ్రప్రభ : మంథని మండలం విలోచవరం గ్రామ సర్పంచ్ గా కొండ ప్రేమలత రవీందర్ విజయం(success) సాధించారు. ఆమె తన సమీప అభ్యర్థిపై 178 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
విద్యావంతురాలు, న్యాయవాది అయిన ప్రేమలత వైపు గ్రామస్తులు మొగ్గు చూపడం విశేషం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఐదు సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉంటూ, గ్రామంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలంతా ఆమెకు శుభాకాంక్షలు(best wishes) తెలియజేస్తున్నారు.

