Success | ఆశీర్వదించండి.. ప్రజాసేవే లక్ష్యం

Success | ఆశీర్వదించండి.. ప్రజాసేవే లక్ష్యం

Success | పెద్దవంగర, ఆంధ్రప్రభ : ఉప్పరగూడెం గ్రామ ప్రజలు ఆశీర్వదించాలని.. అభివృద్దే ధ్యేయంగా పని చేస్తానని కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి దుంపల శ్రీదేవి శ్యామ్ అన్నారు. ఈ రోజు వాడవాడలా జోరుగా తిరుగుతూ, విజయం(success) దిశగా దూసుకెళ్తున్నారు. దుంపల శ్రీదేవి శ్యామ్ మాట్లాడుతూ.. కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేయాలని ఓటర్లతో మమేకమై అప్యాయంగా పలకరిస్తూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.

ప్రజా సేవకు జీవితాన్ని(life) అంకితం చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. డిసెంబర్ 14 న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించారు.

Leave a Reply