Subsidy | మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ సత్తా చాటాలి

Subsidy | మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ సత్తా చాటాలి
- తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే కిశోర్ కుమార్
Subsidy | మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేసి,బి ఆర్ ఎస్ సత్తా చాటాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా గాధరి కిశోర్ కుమార్ అన్నారు. గురువారం స్థానిక ఆర్యవైశ్య భవన్ లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏండ్లలో ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారని, పార్టీ కార్యకర్తలు ఆయా వార్డులలో ప్రజలకు కాంగ్రెస్ వైఫల్యాలను వివరించి బి ఆర్ ఎస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఆయా వార్డులలో అభ్యర్థుల గెలుపు కోసం సూచనలు చేశారు. ఈ సందర్భంగా 12 వార్డుల్లో ఇంచార్జి లను నియమించారు. గత 10 ఏండ్ల లో బి ఆర్ ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వరించాలన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ హామీలైన మహిళలకు రూ.2500, గ్యాస్ సబ్సిడీ, తులం బంగారం, రుణమాఫీ ,రైతు భరోసా, కూలీలకు ఆత్మీయ భరోసా అమలు కావడం లేదని, హామీల అమలు పై ప్రజలకు క్షుణ్ణంగా వివరించి ప్రజలను చైతన్య పరుచాలన్నారు.
ఈ సమావేశంలో బి ఆర్ ఎస్ పట్టణ ,మండల అధ్యక్షుడు జంగ శ్రీనివాస్, పొన్నెబొయిన రమేష్, మదర్ డైరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మి నర్సింహారెడ్డి, రాష్ట్ర నాయకులు నేవురి ధర్మేంధర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ లు మేఘారెడ్డి, మహేంద్రనాధ్, యాకూబ్ రెడ్డి, అడ్డగుడూర్ మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, కొండ సోoమల్లు, మర్రి అనిల్ కుమార్, శ్రీరాముల అయోధ్య తదితరులు పాల్గొన్నారు.
