నివేదిక పంపండి
- కలెక్టర్ టెలీకాన్ఫెరెన్స్
విజయ నగరం, ఆంధ్ర ప్రభ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జరిగిన పంట నష్టాలను, రహదారులు, విద్యుత్(electricity) తదితర నష్టాలను అంచనా వేసి శనివారం సాయంత్రం లోగా పంపాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి(S. Ramsundar Reddy) ఆదేశించారు. ఎటువంటి వివాదాలకు తావు లేని, ఖచ్చితమైన, పారదర్శకమైన అంచనాలను క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవాలను పంపాలని సూచించారు.
శనివారం ఉదయం కలెక్టర్ యూరియా సరఫరా(Supply of Urea), భారీ వర్షాలు, జీ.ఎస్.టీ కాంపెయిన్ తదితర అంశాల పై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూరియా(Urea) సరఫరా పై వ్యవసాయ శాఖ అధికారుల నుండి అభిప్రాయాన్ని తీసుకున్నారు. సక్రమంగా పంపిణీ జరిగేలా చూడాలన్నారు. సూపర్ జీ.ఎస్.టీ(Super G.S.T) పై ఏ రోజు షెడ్యూల్ ఆ రోజు పాటించాలని సూచించారు. కార్యక్రమాల వివరాలను వెబ్సైట్ నందు అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ టీసీలో జేసీ సేధు మాధవన్(Madhavan), జిల్లా అధికారులు పాల్గొన్నారు.