విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలి..

విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలి..

కష్ట పడి చదివి.. ఉన్నత స్థాయికి చేరుకోవాలి..
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్, ఆంధ్రప్రభ : ప్రతి విద్యార్థి ఏకాగ్రతతో చదివినప్పుడే అనుకున్న గమ్యం చేరుతారని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా (Amber Kishore Jha) అన్నారు. గురువారం కమాన్ పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ క్రైమ్ లపై అవగాహన సదస్సు నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ కాశీమల్ల సుధాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సైబర్ మోసాలు ఎన్నో జరుగుతున్నాయని, ఎంతో జాగ్రత్త ఉండాలన్నారు.

బ్యాంకుల (banks) పేరుతో లోన్ల పేరుతో ఓటీపీలు చెప్పాలని మోసం చేస్తున్నారని, అలాంటి ఓటీపీలను ఎప్పుడు గానీ చెప్పకూడదన్నారు. సైబర్ పేరుతో ఎందరో అభాగ్యులు డబ్బులు పోగొట్టుకున్నారని, వాటి జోలికి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే కొందరు ఫోన్ చేసి బటన్ నొక్కాలని చెపితే.. ఎట్టి పరిస్థితుల్లో నొక్కకూడదన్నారు.

అలాగే ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఇంత వాడినయ్యానని, మీరు కూడా శ్రద్ధగా చదివి తనలాగే కావాలని విద్యార్థులను కోరారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల మాట విని పాఠశాలలో శ్రద్ధగా పాఠాలు విని కళాశాలకు మంచి గుర్తింపు తేవాలన్నారు. ఈకార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి కరుణాకర్, గోదావరిఖని మడత రమేష్, సైబర్ క్రైమ్ డిఎస్పి రంగారెడ్డి, గోదావరిఖని టూటౌన్ సిఐ నక్క ప్రసాదరావు, ఎస్సై కొట్టే ప్రసాదరావు పాల్గొన్నారు.

Leave a Reply