విద్యార్థులు క్రీడ‌ల్లో రాణించాలి..

విద్యార్థులు క్రీడ‌ల్లో రాణించాలి..

చిట్యాల, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం క్రీడ శాఖకు పెద్దపీట వేయడం జరుగుతుందని నల్లగొండ జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి మహమ్మద్ అక్బర్(Muhammad Akbar) తెలిపారు. ఈ రోజు చిట్యాల పట్టణ కేంద్రంలో గల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా టైక్వాడ్ కలర్ బెల్ట్ టెస్ట్ పోటీలు(Taekwondo Color Belt Test Competitions) నిర్వహించారు.

చిట్యాల, రామన్నపేట, నార్కట్పల్లి నుంచి 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 10 ఎల్లో, 5 బ్లూ వన్, 2 బ్లూ వన్, 2 రెడ్ బెల్టులను విద్యార్థులు సాధించారు. విజయం సాధించిన విద్యార్థులకు బెల్టులను ప్రధానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడల్లో రాణించాల‌న్నారు. ఈ క్రీడ‌లు స్పోర్ట్స్ కోటాకు, ఉన్నత చదువులకు, ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ సుధాకర్, కోచ్ పి పనింద్ర కుమార్(Coach P Panindra Kumar), డి వైష్ణవ రెడ్డి తదితరు పాల్గొన్నారు.

Leave a Reply