విద్యార్థులు ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగి ఉండాలి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; విద్యార్థులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలపై అవగాహనకలిగిఉండాలని ఊట్కూర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల జిహెచ్ఎం కుసుమ, ఎస్ బి ఐ కౌన్సిలర్ ఎస్ కే చాంద్ సుల్తానా అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎస్బిఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని పొదుపు అలవర్చుకోవాలన్నారు. ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించడంతోపాటు ఈకే వైసీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఆర్.బి.ఐ సెబి పి ఎఫ్ ఆర్ డి ఏ ఐ ఆర్ డి ఏ ఐ పైలెట్ ప్రాజెక్టులతో కలిపి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు ప్రభుత్వ పథకాలు సైబర్ నేరాలను నియంత్రించేందుకు తల్లిదండ్రులకు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
