గండుగులపల్లి ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత

గండుగులపల్లి ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత

దమ్మపేట, ఆంధ్రప్రభ : ​దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనం అనంతరం పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సుమారు 20 మంది బాలికలు, బాలురు వాంతులు, విరేచనాలు కావడంతో పాఠశాలలో ఒక్కసారిగా కలకలం రేగింది.


​వెంటనే అప్రమత్తమైన పాఠశాల ఏఎన్ఎం వసుంధర బాధితులకు ప్రథమ చికిత్స అందించి మందులను విద్యార్థులకు అందజేశారు.అనంతరం పట్వారీగూడెం పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్ దివాకర్ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం.ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్ సంజయ్‌ మలకార్ ను వివరణ కోరగా విద్యార్థులకు ప్రతిరోజూ డైట్ చార్ట్ ప్రకారమే ఆహారం అందిస్తున్నామని తెలిపారు.

వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పుల వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, వాతావరణ మార్పులు , అజీర్తి కారణంగానే విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయినట్లు డాక్టర్ దివాకర్ స్పష్టం చేశారు. విద్యార్థులంతా కోలుకోవడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply