Students | బదిరుల పాఠశాలకు 90 మంచాలు
- ఎమ్మెల్యే సొంత నిధులతో అందజేత
Students | బాపట్ల రూరల్, ఆంధ్రప్రభ : ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు తన సొంత నిధులతో రాయల్ మెరైన్ హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా బధిరుల పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం 90 మంచాలు పాఠశాల ప్రిన్సిపాల్ రజియాకు అందజేశారు. శనివారం మండలంలోని వెదుళ్ళపల్లి గ్రామంలో ఏపీ విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ బధిరుల పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించారు. పాఠశాల విద్యార్థులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. తన సొంత నిధులతో 90 మంచాలు పాఠశాలకు అందించారు. విద్యార్థులతో మమేకమై ముచ్చటించారు. పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు కే పద్మ, తదితర ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, మండల పార్టీ నాయకులు, వెదుళ్ళపల్లి గ్రామ పార్టీ నాయకులు, స్టువర్టుపురం గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



